kinnerasani vachindamma....


కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి

విశ్వనాధ కవితై....అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై... అది కూచిపూడి నడకై
పచ్చని చేల పావడ గట్టి... పచ్చని చేల పావడ గట్టి
కొండ మల్లెలే కొప్పున పెట్టి...వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి

ఎండల కన్నే సోకని రాణి
పల్లెకు రాణి పల్లవ పాణి
కోటను విడిచి పేటను విడిచి
కోటను విడిచి పేటను విడిచి
కనుల గంగా పొంగే వేళ ,నదిలా తానే సాగే వేళ
రాగాల రాదారి పూదారి అవుతుంటే
ఆ రాగాల రాదారి పూదరి అవుతుంటే

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి

మాగానమ్మా చీరలు నేసే
మలి సంధ్యమ్మా కుంకుమ పూసే
మువ్వల బొమ్మా ముద్దుల గుమ్మా
మువ్వల బొమ్మా ముద్దుల గుమ్మా
గడప దాటి నడిచే వేళ
అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యరి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యరి అందాలు గోదారి చూస్తుంటే

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి

http://youtube.com/watch?v=MPsVi3hZosc

Comments

hi...this one of the good songs of ilaya raja and S P Balu, Sailaja
ఒకసారి సాంగ్ చెచ్ చేస్తారా? తప్పు వుంది అనుకుంట , విశ్వనాథ పలుకై ఏమో , మేరు విశ్వనాథ కవితై అని రాసారు, ఒకసారి చూడండి.
Swapna said…
Thanku Santosh gaaru...check chesi correct chesthaa mistake unte

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki