mellagaa karagani


మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం

తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లుని వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ ఈ బంధం

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం

నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా
ఆ ఉరుములు లోన నీ పిలుపులు వింటున్నా
ఈ చిట పటలో చిటికెల తాళం నీదేనా

మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా
జత పడే స్నేహమై అనునయించనా

చలి పిడుగుల సడి విని జడిసిన బిడియం తడబడి నిను విడదా

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ ఈ బంధం

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం

ఈ పెనుమరుగైన ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరు చినుకైన నీ సిరులను చూపేనా
ఆ వరుణికే రుణపడిపోనా ఈ పైనా

త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైన
విడుదలే వద్దని ముద్దులియ్యనా

మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ ఈ బంధం

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం

వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లుని వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ ఈ బంధం

http://youtube.com/watch?v=d6FA9LvWFYU

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki