Apudo epudo yepudo....


అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి
అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసిని
మదిలో కధలా మెదిలే నా కలల సుహాసిని
ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని

అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి
అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి

తీపికన్నా ఇంకా తీయనైన పేరే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే
హాయికన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే
నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే

అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి
అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి

నన్ను నేనే చాల తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పక పొతుంటే
నన్ను నేనే ఎంతో మెచ్చుకుంటా ఎదో చిన్నమాటే నాతో నువ్వు మాటాడావంటే
నాతొనే నెనుంటా నీ తోడే నాకుంటే
ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే

అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి
అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి

http://www.youtube.com/watch?v=ti-Inr_jyX0

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu