alanaati ramachadrudu


అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి

తెలుగింటి పాలసంద్రం కనిపెంచిన కూన
శ్రీ హరి ఇంటి దీపమల్లె కనిపించిన జాన
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీద నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మ వెన్నేలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిరాలేవని వెల వెల బోవమ్మా

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు

అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయానా
కళ కళ జంటను పదిమంది చూడంది
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షతలేయండి

సీతారాముల కల్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపాన
గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మధుని వొళ్ళు ఈ చల్లని సమయాన

దేవుళ్ళ పెళ్ళి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి వివరములడగక బంధువులంతా కదలండి

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీద నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మ వెన్నేలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిరాలేవని వెల వెల బోవమ్మా

http://youtube.com/watch?v=Y1gKGTAVDNo

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki