janaki kalaganaledhu


జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

ఆనాడు ఎవరు అనుకోనిది
ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం... మన జీవన పారాయణం

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

చెలి మనసే శివధనుసయనది తొలి చూపుల వశమైనది
వలపు స్వయంవరమైనపుడు గెలువనిది ఏది
ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముడికి ఇధియశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి

తొలి చుక్కవు నీవే
చుక్కానివి నీవే
తుది దాకా నీవే
మరు జన్మకు నీవే

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

సహవాసం మనకు నివాశం
సరిహద్దు నీలాకాశం
ప్రతి పొద్దు ప్రణయావేశం
పెదవులపై హాసం

సుమసారం మన సంసారం
మణిహారం మన మమకారం
ప్రతిరోజు ఒక శ్రీకారం
పరవశ శృంగారం

బ్రతుకంటే నీవే
కధకానిది నీవే
కలలన్ని నావే
కలకాలం నీవే

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు

ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం ....మన జీవన పారాయణం

http://youtube.com/watch?v=3_qdZdzRvvg

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu