Aakasam taakelaa


ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల … అందించే ఆహ్వనం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రెమంటే

ఆనువనువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం

దాహం లో మునిగిన చిగురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దుర పోయిన రంగులు అన్ని రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే

ఫ్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా
ఫ్రణయం ఎవరి హృదయంలొ ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా

ఫ్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే

అది చరితలు సైతం చధవని వైనం … కవితలు సైతం పలకని భావం… సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరి దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా … తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా… తనలో కనిపించే కలలకు తొలి పిలుపేదంటే

మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే

తను కొలువైవుండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే … నడకల్లో తడబాటైన నాత్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే … ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా........
http://youtube.com/watch?v=PHq67DnRzkA

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki