pacchani chilukalu todunte


పచ్చని చిలుకలు తోడుంటే ....పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు
ఈ లోకంలో కన్నీరింక చెల్లు

పచ్చని చిలకలు తోడుంటే.... పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు
ఈ లోకంలో కన్నీరింక చెల్లు

చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే...
అరెచిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకా చిలుకకు చీరలెందుకు...
అరెప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట

పచ్చని చిలుకలు........

అందని మిన్నే ఆనందం
అందే మన్నే ఆనందం
భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం

మంచుకి ఎండే ఆనందం
వాగుకి వానే ఆనందం..
అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం

బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం...
చెలియ వయసుడిగే స్వగతంలో అనుభందం అనందమానందం

పచ్చని చిలుకలు.....

నీ శ్వాసను నేనైతే...నా వయసే ఆనందం
మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం
చలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం...
నాచెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం

అందం ఓ ఆనందం
బంధం పరమానందం...
చెలియా ఇతరులకై కను జారే కన్నీరే అనంద మానందం

పచ్చని చిలుకలు.....

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu