Nee navvu cheppindhi naatho


నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో

నాకై చాచిన నీ చేతిలోచదివాను నా నిన్నని
నాకై చాచిన నీ చేతిలోచదివాను నా నిన్నని
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపు ని

పంచెందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏ తొడుకి నోచుకోనినడకెంత అలుపో అని

నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించని, నడి రేయి కరిగించనీ

నా పెదవిలో ఇలాగే చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ

ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో

తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదే సుభముహూర్తం సంపూర్ణమైయెందుకు

మనమె మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu