Naa manasuki pranam posi


నా మనసుకి ప్రాణం పోసి...
నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి
ఓ ఓ ఓ...

నా వయసుకి వంతెన వేసి
నా వలపుల వాకిలి తీసి
మది తెర తెరచి ముగ్గే పరచి ఉన్నావు లోకం మరచి

నా మనసుకి ప్రాణం పోసి..
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి

నీ చూపుకి సూర్యుడు చలువాయే
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే
నీ చొరవకి, నీ చెలిమికి మొదలాయే మాయే మాయే

నీ అడుగుకి ఆకులు పువులాయే
నీ కులుకుకి కాకులు కవులాయే
నీ కలలకి,నీ కధలకి కదలాడే హాయే హాయే

అందంగా నన్నే పొగిడి ,ఆ పైన ఏదో అడిగి..
నా మనసనే ఒక సరుసులో అలజడులే సృస్టించావే

నా మనసుకి ప్రాణం పోసి...
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి

ఒక మాట ప్రేమగ పలకాలే
ఒక అడుగు జత పడి నడవాలే
ఆ గురుతులు నా గుండెలొ ప్రతి జన్మకు పదిలం పదిలం

ఒకసారి ఒడిలో ఒదగాలే
ఎదపైన నిదరేపోవాలే
తియతియని నీ స్మృతలతో బ్రతికేస్తా నిమిషం నిమిషం

నీ ఆశలు గమనించాలే
నీ అతృత గుర్తించాలే
ఎటు తేలక బదులీయక మౌనంగా చూస్తున్నాలే....

http://youtube.com/watch?v=_cP1ScgWMFw

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu