sita ramula kalyanam chootamu raarandi


సీతరాముల కల్యాణము చూతము రారండి
శ్రీ సీతరాముల కల్యాణము చూతము రారండి

సిరి కల్యాణపు బొట్టును పెట్టి...బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటనుగట్టి ..నుదుటనుగట్టి
పారాణిని పాదాలకు పెట్టి ...ఆ ఆ ఆ ఆ ఆ
పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళికూతురై వెలసిన
సీత..కల్యాణము చూతము రారండి
శ్రీ సీతరాముల కల్యాణము చూతము రారండి

సంపెగి నూనెను కురులను దువ్వి...కురలను దువ్వి
సొంపుగ కస్తూరి నామము దిద్ది..నామము దిద్ది
చంపగ వాసి చుక్కను పెట్టి..పెళ్ళికొడుకై వెలసిన
రాముని కల్యాణము చూతము రారండి
శ్రీ సీతరాముల కల్యాణము చూతము రారండి

జానకి దోసిట కెంపుల బ్రోవై
రాముని దోసిట నీలపు రాసై
ఆణిముత్యములు తలంబ్రాలుగా.....ఆ ఆ ఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇదమున మెరసిన
సీతరాముల..కల్యాణము చూతము రారండి
శ్రీ సీతరాముల కల్యాణము చూతము రారండి

http://www.youtube.com/watch?v=2O0FTnn6F_A

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu