Chinuku tadiki


ఛినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా

హిందోళంలా సాగె అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా ... ఆమని మధువనమా

ఛినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా


పసిడి వేకువలు పండు వెన్నెలలు, పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరి చేల సంపదలు ,అచ్చ తెలుగు మురిపాల సంగతులు కళ్ళ ముందు నిలిపావే ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా
ఆ... ఆగని సంబరమా ఆ... ఆగని సంబరమా


వరములన్ని నిను వెంటబెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నదే కుందనాల బొమ్మ
సిరులరాణి నీ చేయి పట్టి శ్రీహరిగ మారునని రాసిపెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ... రాముని సుమ శరమా ఆ... రాముని సుమ శరమా

ఛినుకు.....

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki