Ye chota vunnaa


ఏ చోట ఉన్నా నీ వెంట లేనా

సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై
శ్వాస లేని ఆశ నేనై
మిగలనా........

నువ్వే నువ్వే కావలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం

నేల వైపు చూసే నేరం చేసావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ బంధిస్తుందా మల్లె పూవుని
ఏమంత పాపం ప్రేమా ప్రేమించడం ఇకనైనా చాలించమ్మా వేదించడం

చెలిమై కురిసె సిరివెన్నెలవా
క్షణమై కరిగే కలవా

వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాప లా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటె నా ప్రతి కల
కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా

నాక్కూడ చోటేలేని నా మనసులో ..నిన్ను ఉంచగలనా ప్రేమ యీ జన్మలో

వెతికే మజిలీ దొరికే వరకు
నడిపే వెలుగై రావా

సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే

http://youtube.com/watch?v=q9Vr7C0fRGA

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu