ఏదో ప్రియరాగం వింటున్నా..


ఏదో ప్రియరాగం వింటున్నా... చిరునవుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా

ఏదో నవ నాట్యం చూస్తున్నా... సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా

ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా....ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైన

ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే..

నువ్వుంటే నిజమేగా స్వప్నం
నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంతా ఏదొ తీయని సంగీతం

నువ్వుంటే ప్రతి అడుగు అందం
నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం

పాట పాడదా మౌనం
పురి విప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూదోట చేయదా ప్రేమబాటలొ పయనం

దారిచూపదా శూన్యం
అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం

ప్రేమా నీ సావాసం .....నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం.... నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం...

నువ్వుంటే ప్రతి ఆశ సొంతం
నువ్వుంటే చిరుగాలే గంధం
నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం

నువ్వుంటే ప్రతి మాట వేదం
నువ్వుంటే ప్రతి పలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనె నిండెను ఈ లోకం

ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానే ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన

హరివిల్లె నన్నల్లే ఈ రంగులు నీ వల్లే
సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోన

నువ్వుంటే దిగులంటూ రాదే
నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటె మరి మాటలు కూడ పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే
నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైన ఎంతో ఇష్టాలే

http://youtube.com/watch?v=PSllknu4DTw

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu