Mallela vaana


మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా
తేనేల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా
మైమరచే అనందాలే ప్రతి నిమిషానా

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

చిన్న చిన్న సంగతులే మల్లె పూల విరిజల్లు
తుళ్ళుతున్న అల్లరులే ముల్లు లేని రోజాలు
అందమైన ఆశలే ,చిందులాడు ఊహలే నందనాల పొదరిల్లు
గుప్పెడంత గుండెలొ గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు
ఓ.... వన్నెల పరవళ్ళు పున్నాగ పరిమళాలు
వయసే తొలి చైత్రం పూసే సమయాన
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

కొమ్మ లేని కుసుమాలు కళ్ళలోని స్వప్నాలు
మొగలిపూల గంధాలు మొదలయ్యేటి బంధాలు
కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే పారిజాత హారాలు
ముద్దు గుమ్మ ఎదలో మొగ్గ విచ్చు కధలే ముద్దమందారాలు
ఆ.... నిత్య వసంతాలు ఈ పులకింతల పూలు
ఎపుడు వసివాడని వరమై హృదయాన
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu