Kannullo nee roopame


కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే

నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే

ఆ ఊసుని తెలిపేందుకు నా బాష ఈ మౌనమే

కన్నుల్లో నీ రూపమే

మదిదాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా
నీ నీలికన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం

కన్నుల్లో నీ రూపమే

అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నా మదిలోని మాటేదని
తలవంచుకుని నేను తెగ ఎదురు చూసాను నీ తెగువ చూడాలని
చూస్తూనే వేళంత తెలవారి పోతుందో ఏమో ఎల ఆపడం

కనుల్లో నీ రూపమే

http://youtube.com/watch?v=VUvH1paU7bE

Comments

Anonymous said…
hiii swapna...u hav done a nice job by postig this song
thnq

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu