asalemi gurtuku raadhu


అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక

నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా

అసలేం గుర్తుకురాదు

గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను కప్పుకు చిగురించనీ

అల్లుకొమ్మని గిల్లుతున్నది చల్లచల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ

అసలేం గుర్తుకురాదు

కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ
కౌగిలింతల సీమలో కోటకట్టుకుని కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు హాహాకారం

మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి ఈ రోజు రమ్మన్నా రాదేమో
నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం

అసలేం గుర్తుకురాదు

http://www.megavideo.com/?v=RUM1IR0P

Comments

Prathyusha said…
nekuna interest ki, vopika ki mechukovali swapna. nicely done. Oka china suggestion.Since your blog is about lyrics, why don't you categorize your songs by lyricists.
Swapna said…
First of all ..Thanku nvery much for ur comment and suggestion :)..Swapna ki koncham lyricists gurinchi knowledge thakkuva kadha...but chesthaanu emaina doubt vasthe ninne aduguthaanu...

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki